
జూబ్లీహిల్స్, వెలుగు: రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీకి ముస్లింలు అండగా నిలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. శనివారం జూబ్లీహిల్స్ సులేమాన్ నగర్ చెందిన మైనార్టీ లీడర్ అహ్మద్ నక్షాబంది ఇంటికి కేటీఆర్వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లింలతో ఆయన సమావేశమయ్యారు. నియోజకవర్గంలో మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించామని, మద్దతు తెలపాలని కోరారు. మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇంతియాజ్ పాల్గొన్నారు.