వచ్చే టర్మ్​లో ఉప్పల్​లో మూడు ముఖ్యమైన పనులు చేస్త : కేటీఆర్

వచ్చే టర్మ్​లో ఉప్పల్​లో మూడు ముఖ్యమైన పనులు చేస్త : కేటీఆర్

ఉప్పల్, వెలుగు:  అల్లాటప్పా నాయకులు హైదరాబాద్​ను  అభివృద్ధి చేయలేరని, సీఎంకేసీఆర్​తోనే అది సాధ్యమని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉప్పల్​ సెగ్మెంట్ పరిధిలోని మల్లాపూర్​, ఈసీఐఎల్​లో నిర్వహించిన రోడ్​షోలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ ​అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. శాంతిభద్రతలను మెయింటెన్ చేయడమనేది కేసీఆర్​తోనే సాధ్యమన్నారు. 

వచ్చే టర్మ్​లో ఉప్పల్​లో మూడు ముఖ్యమైన అభివృద్ధి పనులు చేసుకుందామన్నారు. మూసీ  బ్యూటిఫికేషన్​తో పాటు హబ్సిగూడలో ఇండ్లలోకి వాన నీరు రాకుండా రూ.20వేల కోట్లతో డ్రైనేజీ సిస్టమ్​ను ఆధునీకరిస్తామన్నారు. మెట్రోను ఉప్పల్​ నలుమూలల కాప్రా, మల్లాపూర్​ దాకా విస్తరించి అందుబాటులోకి తెస్తామన్నారు. పేదవాళ్లకు అన్నపూర్ణ, సౌభాగ్య లక్ష్మి, సన్నబియ్యం ఇచ్చే పథకాలు అమలు చేస్తామన్నారు. ఈసారి  కారు గుర్తుకు ఓటేసి లక్ష్మారెడ్డిని గెలిపించాలన్నారు.  రోడ్​ షోలో  బండారి లక్ష్మారెడ్డితోపాటు  రాగిడి లక్ష్మారెడ్డి, ఇతర నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.