కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతారు

కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతారు
  • కైతలాపుర్లో టీఆర్ఎస్ బహిరంగ సభలో కుత్బుల్లాపూర్  ఎమ్మెల్యే వివేక్

హైదరాబాద్: రానున్న రోజుల్లో కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని, కేసీఆర్ ఢిల్లీలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారని కుత్బుల్లాపూర్  ఎమ్మెల్యే వివేక్ పేర్కొన్నారు. కైతలాపూర్ ఆర్వోబి ప్రారంభోత్సవ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్  ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తథ్యం అన్నారు. కేసీఆర్ ఢిల్లీలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారని, కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఎమ్మెల్యే వివేక్ చేసిన వ్యాఖ్యలకు కార్యకర్తలు చప్పట్లు కొడుతూ ఈలలు, కేకలతో స్వాగతించారు.