మహిమాన్విత క్షేత్రమైన మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం సోమవారం తెల్లవారుజామున నిర్వహించనున్నారు. ఈ వేడుకను చూసేందుకు ఆదివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ముందుగా పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
కొత్త కుండల్లో అన్నం, పచ్చిపులుసు వండి స్వామికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున రావడంతో స్వామి దర్శనం కోసం రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది. గుట్ట దిగువ నుంచి కొండమీదికి వెళ్లేందుకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఉత్సవాల సందర్భంగా వివిధ రకాల దుకాణాలను ఏర్పాటు చేశారు.- వెలుగు ఫొటోగ్రాఫర్, మహబూబ్ నగర్
