హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కేయూ జేఏసీ నాయకులు మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. కేయూ గ్రౌండ్లో ఆదివారం తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025-26 ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రిని కేయూ జేఏసీ చైర్మన్ ఆరెగంటి నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందించారు.
ఉస్మానియా యూనివర్సిటీ తరహాలోనే సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలని కోరారు. క్యాంపస్ లో సెంట్రల్ లైటింగ్, విద్యార్థులకు సరిపడా హాస్టల్స్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించి, వర్సిటీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కందికొండ తిరుపతి, వైస్ చైర్మన్ కేతపాక ప్రసాద్, నాయకులు అన్వేశ్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
