వరంగల్ కేయూ SDLCE ఎగ్జామ్ టైం టేబుల్ రిలీజ్

వరంగల్ కేయూ SDLCE ఎగ్జామ్ టైం టేబుల్  రిలీజ్

కేయూ క్యాంపస్, వెలుగు: కేయూ SDLCE ఎగ్జామ్​ టైం టేబుల్ ను ఎగ్జామినేషన్స్  కంట్రోలర్  కట్ల రాజేందర్, అడిషనల్  కంట్రోలర్  జి.పద్మజ విడుదల చేశారు. డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ ఫైనల్ ఇయర్(రెగ్యులర్) పరీక్షలు ఆగస్ట్  22 నుంచి, సెకండ్  ఇయర్( ఓల్డ్​ స్టూడెంట్స్) పరీక్షలు ఆగస్టు 23 నుంచి, ఫస్ట్ ఇయర్(ఓల్డ్​ స్టూడెంట్స్) ఆగస్టు 25 నుంచి జరుగుతాయని చెప్పారు. అన్ని పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

 డిప్లొమా ఇన్  కంప్యూటర్  అప్లికేషన్స్  ఆగస్టు 6 నుంచి, ప్రాక్టికల్స్  ఆగస్టు 21 నుంచి, పీజీడీసీఏ సెకండ్  సెమిస్టర్  ఎగ్జామ్స్ ఆగస్టు 7 నుంచి, ప్రాక్టికల్స్​ 20 నుంచి జరుగుతాయని తెలిపారు. పీజీడీసీఏ ఫస్ట్  సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 6 నుంచి, ప్రాక్టికల్స్  ఆగస్టు 21 నుంచి ఉంటాయని చెప్పారు. లైబ్రరీ సైన్స్(ఇయర్  వైజ్ ఓల్డ్​ స్టూడెంట్స్), డిప్లొమా ఇన్  యోగా పరీక్షలు ఆగస్టు 6 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు చూడవచ్చని చెప్పారు.