పేదరికం నుంచి విముక్తి కల్పించేవే పథకాలు

పేదరికం నుంచి విముక్తి కల్పించేవే పథకాలు

కేయూ క్యాంపస్, వెలుగు: పేదరికం, ఆకలిచావులు, ఆత్మహత్యల నుంచి విముక్తి కల్పించేవే నిజమైన సంక్షేమ పథకాలని ఎమ్మెల్సీ కోదండరామ్​అన్నారు. కేయూ రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వర్సిటీలోని సెనెట్ హాల్​లో రిజిస్ట్రార్ రామచంద్రం అధ్యక్షతన సోమవారం భారతదేశంలో సరళీకరణ అనంతరం జనరంజక విధానాలు అనే అంశంపై జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమెరికా కనుసన్నల్లో నూతన ఆర్థిక, సరళీకరణ విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు.

1991 నుంచి దేశంలో అమలవుతున్న సరళీకృత విధానాలు అగ్రవర్ణ ప్రైవేట్​పెట్టుబడిదారుల వ్యాపార విస్తరణ కోసం 90 శాతం దోహదపడుతుంటే.. కేవలం 10 శాతమే గ్రామీణ ప్రజలకు ఉపయోగపడుతున్నాయని సామాజికతత్వవేత్త, రచయిత, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య  విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న మార్కెటీకీకరణలో సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నిర్వీర్యమైపోతున్నాయని ప్రముఖ సంపాదకుడు డాక్టర్ కె.శ్రీనివాస్ ఆరోపించారు.  కేయూ వీసీ ప్రొ.కె.ప్రతాప్​రెడ్డి, వర్సిటీ సోషల్ సైన్స్ డీన్ సురేశ్ లాల్, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.