కేయూ కామన్​ మెస్​ వద్ద విద్యార్థుల నిరసన

కేయూ కామన్​ మెస్​ వద్ద విద్యార్థుల నిరసన

హనుమకొండ, కేయూ క్యాంపస్, వెలుగు : కాకతీయ యూనివర్సిటీలో కామన్​ మెస్​లో బుధవారం రాత్రి భోజనం చేస్తున్న ఓ విద్యార్థి ప్లేట్​లో బొద్దింక కనిపించింది. పచ్చడిలో బొద్దింక కనిపించగా, విషయాన్ని మెస్​కేర్​టేకర్ల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. వారు పరారయ్యారని స్టూడెంట్స్​ ఆరోపిస్తున్నారు.ఈ సందర్బంగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం కామన్​ మెస్​ వద్ద నిరసన వ్యక్తం చేశారు.

బీసీ విద్యార్థి సంఘం నాయకుడు ఆరెగంటి నాగరాజు మాట్లాడుతూ గత ఏప్రిల్, మే నెలల బిల్లుల్లో హాస్టల్​ డైరెక్టర్, సూపరింటెండెంట్​ అవినీతికి పాల్పడ్డారని, దీనిపై విచారణ జరిపించాలన్నారు. హాస్టల్​డైరెక్టర్, కేర్​టేకర్లను తొలగించాలని డిమాండ్​చేశారు. బీసీ విద్యార్థి సంఘం నాయకులు మురళి, నర్సింహ, చందు, నవీన్​, రమేశ్​, రవి, మధు, వెంకటేశ్​, వినోద్​ఉన్నారు. అయితే మెస్​ సిబ్బంది, డైరెక్టర్​పై కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మరికొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.