తనవల్ల ఒకరు చనిపోయారన్న మనస్తాపంతో ఆత్యహత్య

తనవల్ల ఒకరు చనిపోయారన్న మనస్తాపంతో ఆత్యహత్య

తన కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోవడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కూకట్ పల్లిలో జరిగింది. గద్వాల జిల్లా రాజోలికి చెందిన ఎన్‌.డి.మోహన్ ‌(24) మూడేళ్ల క్రితం హైదరాబాద్ లోని కూకట్ పల్లి జయనగర్ లో తన దోస్తులతో కలిసి నివసిస్తున్నాడు. గురువారం పొద్దున పటాన్ చెరు దగ్గర ఉన్న అనంతపద్మనాభ స్వామి దేవాలయానికి మోహన్ అతని ప్రెండ్స్ హరికృష్ణ, ఈశ్వర్‌, గణేశ్‌, నానితో కలిసి తన కారులో వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు మోహన్ నడుపుతున్న కారు కర్దనూర్ వద్ద..   బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేశ్‌ అనే ఫార్మా ఉద్యోగి అక్కడికక్కడే చనిపోగా , శ్రీనివాస్‌రెడ్డి అనే మరో వ్యక్తి గాయపడ్డాడు. యాక్సిడెంట్ అయ్యాక బయపడ్డ మోహన్, అతని ఫ్రెండ్స్ అక్కడినుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లారు.

మోహన్ మాత్రం తన వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయాడని..  తన స్నేహితులకు, చుట్టుపక్కల వాళ్లకు చెప్పి బాధపడ్డాడు.  ఆ బాధలోనే తాను ఉంటున్న బిల్డింగ్  ఐదో అంతస్తుపైకి ఎక్కి పైనుంచి దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చుట్టుపక్కలవాళ్లు మోహన్ ను హాస్పిటల్ కు తరలిస్తుండగా మద్యలోనే ప్రాణాలు విడిచాడు. కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.