అక్కడేం చేయాలి.. వంట చేయాలా? బిగ్ బాస్ ఆఫర్పై కుమారి ఆంటీ రియాక్షన్

అక్కడేం చేయాలి.. వంట చేయాలా? బిగ్ బాస్ ఆఫర్పై కుమారి ఆంటీ రియాక్షన్

కుమారి ఆంటీ(Kumari Aunty).. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన ఈమెదే హవా. హైదరాబాద్ ఫేమస్ ప్లేస్ లో ఫుడ్‌ స్టాల్‌ నడుపుకునే ఈ ఆంటీ ఒకే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయారు. వచ్చిన కస్టమర్స్ ను నాన్నా, బుజ్జి, కన్నా అంటూ ప్రేమగా పలకరిస్తూ ఆకట్టుకుంటున్నారు. దీంతో యూట్యూబర్లు ఆమె ఇంటర్వూస్ కోసం ఎగబడ్డారు. అక్కడ జనాల వీడియోలి తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె వంటలకు గిరాకీ బాగా పెరిగిపోయింది. 

ఇందులో భాగంగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు కుమారు ఆంటీ. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మేము 2009లో హైదరాబాద్‌ వచ్చాము. మొదట్లో బట్టలు కుట్టేదాన్ని. ఆతరువాత గాయకుడు హేమచంద్ర ఇంట్లో కొంతకాలం వంటపని చేశాను. ఇక 2011లో ఫుడ్ స్టాల్ ప్రారంభించాను. దాదాపు 13 ఏళ్ళ నుండి ఈ బిజినెస్ లో ఉన్నాను. అలా కొన్ని రోజుల ముందు నేను చెప్పిన ఒక డైలాగ్ ఒకతను వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అలా నేను, నా ఫుడ్ స్టార్ ఫేమస్ అయ్యింది. 

అప్పటి నుండి గిరాకీ బాగా పెరిగింది. అంటూ చెప్పుకొచ్చారు కుమారి ఆంటీ. ఇప్పుడు మీరు ఫేమర్ అయ్యారు కదా బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా అని అడగగా.. అక్కడ ఎం చేస్తారు? వంటలు చేస్తారా? ఒకవేళ నన్ను రమ్మంటే వెళ్లి వంటలు చేయాలా? అంటూ అమాయకంగా బదులిచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ పై కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.