
న్యూఢిల్లీ: ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ బిట్స్ పిలానీని రూ.2,200 కోట్లతో విస్తరిస్తామని ఈ సంస్థ ఛాన్సలర్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ పెట్టుబడి ఐదేళ్లలో జరుగుతుంది.
ప్రాజెక్ట్ విస్తార్ కింద రూ.1,219 కోట్లతో పిలానీ (రాజస్తాన్) , హైదరాబాద్, గోవా క్యాంపస్‌లను విస్తరిస్తామని బిర్లా అన్నారు. ఈ క్యాంపస్‌లలో విద్యార్ధుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 16 వేల నుంచి 21 వేలకు పెరుగుతుందని చెప్పారు. లాబొరేటరీలను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.60 కోట్లు, అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపారు. బిట్స్ పిలానీ డిజిటల్ కింద 32 ప్రోగ్రామ్‌లు, లక్ష మంది లెర్నర్స్‌కు నాణ్యమైన విద్యను అందిస్తామని పేర్కొన్నారు.