కుంభమేళాతో పాపులర్ అయిన మోనాలిసా లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘లైఫ్’. సాయిచరణ్ హీరోగా నటిస్తుండగా, శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వెంగమాంబ క్రియేషనర్స్ బ్యానర్‌పై అంజన్న నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం తాజాగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.
త్వరలోనే రెండో షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు. సురేష్, షాయాజీ షిండే, ఆమని, తులసి, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మురళీ మోహన్ రెడ్డి డీవోపీగా పని చేస్తుండగా, సుకుమార్ సంగీతం అందిస్తున్నారు.
