ఏజెన్సీలో మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు గ్రేట్ : కూనంనేని సాంబశివరావు

ఏజెన్సీలో మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు గ్రేట్ : కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా లాంటి ఏజెన్సీ ప్రాంతంలో కేర్​ హాస్పిటల్​ ఆధ్వర్యంలో గుండె సంబంధిత మెగా హెల్త్​క్యాంప్​ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొత్తగూడెం, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్​లో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా హెల్త్​ క్యాంప్​ను కొత్తగూడెం, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, రాందాస్​ నాయక్​, తెల్లం వెంకట్రావ్​తో పాటు కలెక్టర్​జితేశ్​ వీపాటిల్, ఎస్పీ రోహిత్​ రాజు సందర్శించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్​ కార్డియాలజిస్ట్​ డాక్టర్​ వి.సూర్య ప్రకాశరావు పర్యవేక్షణలో గుండె సంబంధిత ఉచిత మెగా హెల్త్​ క్యాంప్​ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం వారికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. రూ. వేల విలువైన టెస్ట్​లను ఉచితంగా క్యాంపులో చేసినట్టుగా డాక్టర్​ సూర్య ప్రకాశరావు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో డాక్టర్లు  కాంతిలాల్, శ్రీవాస్తవ, ఈషా సింగ్, రాంచందర్, రాహూల్, కిరణ్, పీఆర్​ఓ మునిరెడ్డితో పాటు రాంచందర్​ పాల్గొన్నారు.