
రంగారెడ్డి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు షాద్ నగర్ లోని కొందుర్గు మండల వీఆర్వో అంతయ్య. రూ. 8 లక్షలు డిమాండ్ చేసి రూ. 4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. నియోజకవర్గంలోని కేశంపేట మండలానికి చెందిన ఓ భూమి వ్యవహారంలో రికార్డుల్లో బాధితుని పేరు నమోదు చేయడానికి రూ. 8 లక్షల రూపాయలను డిమాండ్ చేశాడు వీఆర్వో అంతయ్య. డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉన్న బాధితులు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశారు. దీంతో పథకం ప్రకారం విఆర్ఓ అంతయ్యను డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టించారు బాధితులు.
అయితే కేశంపేట మండల ఎమ్మార్వో కోసమే వీఆర్వో అంతయ్య లంచం తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ చెప్పాడు. డబ్బుల కోసం ఒక్క రోజులో ఆన్లైన్ లో రికార్డ్ మాయం చేశారని తెలిపారు.