వరద బాధితులకు కురుమ సంఘం 10 లక్షల విరాళం

వరద బాధితులకు కురుమ సంఘం 10 లక్షల విరాళం

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలోని వరద బాధితులకు రాష్ట్ర కురుమ సంఘం చేయూతనిచ్చింది. రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కు పది లక్షలు విరాళంగా ఇచ్చారు. 

 మేరకు సోమవారం ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, కోశాధికారి కట్ట మల్లేశం కురుమ, రాష్ట్ర కురుమ విద్యార్థి హాస్టల్ చైర్మన్, కార్యదర్శి కొలుపుల నర్సింహా కురుమ, ప్రధాన కార్యదర్శి చిగుమళ్ల రాఘవేందర్ తదితరుల బృందం సీఎం సహాయ నిధికి  పది లక్షల చెక్కును అందజేశారు. 

ఎం రిలీఫ్ ఫండ్ కు పది లక్షలు విరాళం ఇచ్చినందుకు ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, రాష్ట్ర నేతలను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.