ఫీల్ గుడ్ విజువల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఖుషి : జి.మురళి

ఫీల్ గుడ్  విజువల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  ఖుషి : జి.మురళి

‘అందాల రాక్షసి’ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కెరీర్ ప్రారంభించిన జి.మురళి... తమిళంలో కబాలి, కాలా, సార్పట్ట పరంపర చిత్రాలు చేసి ‘ఖుషి’ చిత్రంతో మళ్లీ టాలీవుడ్‌‌‌‌‌‌‌‌కు వచ్చారు. విజయ్, సమంత కలిసి నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ‘లవ్ అనగానే ప్రతి ఒక్కరికీ ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. కానీ లవ్, లైఫ్ అంటే మన ఊహలకు అనుగుణంగా ఉండదని ఓ యువకుడికి తెలిసిరావడమే ఈ సినిమా కాన్సెప్ట్. మణిరత్నం సినిమాల్లోలా ఇందులోనూ విజువల్ బ్యూటీని చూస్తారు. 

అలాగని మేము ఆ సీన్స్ కాపీ కొట్టలేదు. అలాంటి ఫీల్ కలిగించేలా విజువల్స్ ఉంటాయి. ఇందులో విప్లవ్, ఆరాధ్య పాత్రల్లో విజయ్, సమంత చూపించిన ఎమోషన్స్ సినిమాకు ఒక బ్యూటీని తీసుకొచ్చాయి. అన్ని కమర్షియల్ అంశాలున్న లవ్, ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇది. దర్శకుడు శివ నిర్వాణ సినిమా మేకింగ్‌‌‌‌‌‌‌‌ గురించే ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ఇంతమంచి మ్యూజిక్ రావడానికి తనకున్న మ్యూజిక్ టేస్ట్ కారణం. 

నా గత చిత్రాలైన కబాలి, కాలా చూస్తే రా అండ్ రస్టిక్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి. కానీ ఇందులో ఫీల్ గుడ్ విజువల్స్ తెరపైకి తీసుకొచ్చే చాన్స్ దక్కింది. ఈ సినిమా చూశాక ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. కెమెరా ద్వారా ఆ ఎమోషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశా’ అన్నారు.