డెన్మార్క్ పై ఫ్రాన్స్ థ్రిలింగ్ విక్టరీ

డెన్మార్క్ పై ఫ్రాన్స్ థ్రిలింగ్ విక్టరీ

దోహా:  గత ఎడిషన్‌‌‌‌‌‌లో ఫ్రాన్స్‌‌‌‌ విజేతగా నిలవడంలో కీ రోల్‌‌‌‌గా నిలిచిన కిలియన్‌‌‌‌ ఎంబాపె తాజా సాకర్​ వరల్డ్​కప్​లో కూడా సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేస్తున్నాడు. తొలి పోరులోనే గోల్‌‌‌‌తో మెరిసిన అతను ఇప్పుడు బలమైన డెన్మార్క్‌‌‌‌పై డబుల్‌‌‌‌ గోల్స్‌‌‌‌తో పంజా విసిరాడు. కీలక సమయాల్లో ఎంబాపె అద్భుత ఆటతో చెలరేగడంతో శనివారం జరిగిన గ్రూప్‌‌‌‌–డి మ్యాచ్‌‌‌‌లో ఫ్రాన్స్‌‌‌‌ 2–1తో డెన్మార్క్‌‌‌‌ను ఓడించి నాకౌట్‌‌‌‌కు చేరువైంది.  ఈ మ్యాచ్​లో  రెండు బలమైన జట్లు  ఆరంభం నుంచి పోటా పోటీగా ఆడాయి. బాల్‌‌‌‌ను తమ కంట్రోల్‌‌‌‌లో ఉంచుకునే ప్రయత్నం చేశాయి. ఫ్రాన్స్‌‌‌‌ మాత్రం పూర్తి ఎటాకింగ్‌‌‌‌ గేమ్‌‌‌‌ ఆడింది. ఫస్టాఫ్‌‌‌‌లో ఆ జట్టు ప్రయత్నాలను డెన్మార్క్‌‌‌‌ నిలువరించడంతో గోల్‌‌‌‌ రాలేదు.

సెకండాఫ్‌‌‌‌లోనూ ఇరు జట్లూ అదే దూకుడు కొనసాగించగా 61వ నిమిషంలో ఎంబాపె తొలి గోల్‌‌‌‌ కొట్టాడు. ప్రత్యర్థి బాక్స్​లో  హెర్నాండెజ్‌‌‌‌కు పాస్​ ఇస్తూ.. తీసుకుంటూ ముందుకెళ్లిన అతను బాల్​ను నెట్‌‌‌‌లోకి పంపి గోల్‌‌‌‌ చేశాడు. అయితే, 68వ నిమిషంలో కార్నర్‌‌‌‌ కిక్‌‌‌‌ను ఆండ్రెస్‌‌‌‌ క్రిస్టెన్సెన్‌‌‌‌ హెడ్డర్‌‌‌‌ గోల్‌‌‌‌ చేయడంతో డెన్మార్క్‌‌‌‌  1–1తో వెంటనే స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లూ దాడులు మమ్మరం చేశాయి. ఎంబాపెతో పాటు హెర్నాండెజ్ షాట్లు గురి తప్పడంతో మ్యాచ్‌‌‌‌ డ్రా అయ్యేలా కనిపించింది. కానీ, 86వ నిమిషంలో ఎంబాపె మరోసారి ప్రత్యర్థి డిఫెండర్లను ఏమారుస్తూ నెట్‌‌‌‌ దగ్గరకు చొచ్చుకెళ్లాడు. గ్రిజ్‌‌‌‌మన్‌‌‌‌ ఇచ్చిన ఇన్‌‌‌‌స్వింగిగ్‌‌‌‌ క్రాస్‌‌‌‌ను నెట్‌‌‌‌లోకి పంపి ఫ్రాన్స్‌‌‌‌ విజయం ఖాయం చేశాడు.

సౌదీకి పోలాండ్​పోటు

లియోనల్​ మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనాను ఓడించి ఈ టోర్నీలో తొలి సంచలనం సృష్టించిన సౌదీ అరేబియా జట్టును పోలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బకొట్టింది. గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–సి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2–0తో సౌదీని ఓడించింది. 39వ నిమిషంలో పియోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కి తొలి గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించాడు. ఫస్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పెనాల్టీ ద్వారా సౌదీ అరేబియా స్కోరు చేసే ప్రయత్నాన్ని  గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెజెష్నీ అద్భుతంగా నిలువరించాడు. ఆపై, 82వ నిమిషంలో  రాబర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవాండోస్కీ మరో గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టడంతో పోలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుసగా రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచింది. 

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలువరించిన అమెరికా

టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అగ్రరాజ్యం అమెరికా టీమ్ నిలువరించింది. హ్యారీ కేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీలోని ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 0–0తో డ్రా చేసుకుంది. 

ఆసీస్‌‌‌‌ 12 ఏండ్ల తర్వాత గెలుపు

తొలి మ్యాచ్‌‌‌‌లో డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ ఫ్రాన్స్‌‌‌‌ చేతిలో ఎదురైన ఓటమి నుంచి ఆస్ట్రేలియా పుంజుకుంది. గ్రూప్‌‌‌‌–డిలో భాగంగా జరిగిన మ్యాచ్‌‌‌‌లో 1–0తో ట్యునీషియాను ఓడించి వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో విజయాల ఖాతా తెరిచింది. ఫస్టాఫ్‌‌‌‌ 23వ నిమిషంలో మిచెల్‌‌‌‌ డ్యూక్‌‌‌‌ చేసిన ఏకైక గోల్‌‌‌‌తో గెలిచిన ఆసీస్​ నాకౌట్‌‌‌‌ రేసులో నిలిచింది. వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో 12 ఏండ్ల తర్వాత కంగారూ టీమ్‌‌‌‌ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. చివరగా 2010లో ఆ జట్టు సెర్బియాపై గెలిచింది.