గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుంది

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుంది

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ 2020 షెడ్యూల్ ను తెలంగాణ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎన్నికలను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించనున్నారు. గ్రేటర్ ఎన్నికలపై తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ స్పందించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తోందని ఎల్.‌రమణ స్పష్టం చేసారు. నేడో రేపో మా అభ్యర్థులను ప్రకటిస్తాం అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు. ఒంటిరిగా టీడీపీ పోటీ చేస్తుంది అని, ఎవరితో పొత్తులుండవు అని ఆయన స్పష్టత ఇచ్చారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిందే చంద్రబాబు అన్నారు. హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది టీడీపీ ప్రభుత్వం అన్నారు. గ్రేటర్ లో టీడీపీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది అని ఆయన అన్నారు