
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో క్రికెట్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్ అధికారికంగా చేరింది. లాస్ ఏంజెల్స్ 28 నిర్వాహకులు సోమవారం (జూలై 14) ఒలింపిక్స్ క్రికెట్ షెడ్యూల్‌ను ప్రకటించారు. 2028 జూలై 12న క్రికెట్ ప్రారంభం కానుంది. ఇప్పటి నుంచి సరిగ్గా మూడు సంవత్సరాలు సమయం ఉంది. ఆరు జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ఒక జట్టు మిగిలిన ఐదు జట్లతో రౌండ్ రాబిన్ తరహాలో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రోజుకు రెండు మ్యాచ్ లు జరిగేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. రెండు పతకాల మ్యాచ్‌లు ప్రత్యేక రోజుల్లో జరగనున్నాయి. మొదటిది జూలై 19న.. గ్రాండ్ ఫినాలే జూలై 29కి రిజర్వ్ చేయబడింది.
మొదటిది జూలై 20న.. గ్రాండ్ ఫినాలే జూలై 29 తేదీలలో జరగనున్నాయి. ఒలింపిక్స్ లో క్రికెట్ టోర్నమెంట్ లాస్ ఏంజిల్స్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోమోనాలోని ఫెయిర్‌గ్రౌండ్స్‌లో ప్రత్యేకంగా నిర్మించిన వేదికలో జరగనుంది. జూలై 14, జూలై 28 న ఎలాంటి క్రికెట్ మ్యాచ్ లు ఉండవు. టీ20 ఫార్మాట్ లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. భారత కాలమాన ప్రకారం డబుల్ హెడర్స్ ఉంటే మొదటి మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ మరుసటి రోజు ఉదయం 7:00 గంటలకు జరుగుతుంది. మహిళల విభాగంలో ఆరు జట్లు, పురుషుల విభాగంలో ఆరు జట్లు ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తాయి.
Also Read:-నాలుగో టెస్టులో పంత్, బుమ్రా ఆడతారా.. గిల్ ఏమన్నాడంటే..?
ఒలింపిక్స్ ఆతిథ్య దేశమైన అమెరికాకు డైరెక్ట్ ఎంట్రీ దక్కే అవకాశం ఉంది. మెన్స్, విమెన్స్‌లో ఆరేసి జట్లతో టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. క్వాలిఫికేషన్ ప్రక్రియను ఇంకా నిర్ధారించలేదు. ప్రతి జట్టులో 15 మంది ప్లేయర్లు ఉంటారు. ప్రస్తుతం ఐసీసీలో ఇండియా, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వేతో కలిపి 12 పూర్తి స్థాయి సభ్య దేశాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 94 అసోసియేట్ దేశాలు మెంబర్స్ గ్రూప్‌లో ఉన్నాయి.
అమెరికా మినహా.. ఒక నిర్దిష్ట కటాఫ్ తేదీలోపు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్–5లో ఉండే జట్లను ఒలింపిక్స్‌కు అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్‌గా 128 ఏళ్ల తర్వాత మెగా క్రీడల్లో క్రికెట్ రీ ఎంట్రీకి మార్గమైతే సుగమమైంది. 1900 పారిస్ ఒలింపిక్స్‌లో చివరిసారి బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య రెండు రోజుల మ్యాచ్ జరిగింది. ప్రస్తుతం దాన్ని అనధికారిక టెస్ట్‌గా గుర్తించారు. లాస్ ఏంజిల్స్ గేమ్స్‌లో క్రికెట్‌తో పాటు బేస్‌బాల్ / సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్ (సిక్సర్లు), స్క్వాష్ కూడా ఉన్నాయి. వీటిన్నింటికి కలిపి 28 పతకాలను కేటాయించారు.
🚨 CRICKET AT 2028 OLYMPICS – FULL SCHEDULE 🏏 (via Cricbuzz)
— Saurabh Kumar (@iamsaurabh1818) July 14, 2025
📅 12th – 29th July
▪️ First Set: 12th – 18th
🥇 Medal Match: 19th July
▪️ Second Set: 22nd – 28th
🥇 Medal Match: 29th July
Double drama. Double medal chance.
Olympics 2028 is going to be PEAK CRICKET. 🔥🌍… pic.twitter.com/nQwYYGBJvB