లాల్ సింగ్ చడ్డా నుంచి థీమ్ పోస్టర్ విడుదల

లాల్ సింగ్ చడ్డా నుంచి థీమ్ పోస్టర్ విడుదల

బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ లేటెస్ట్ మూవీ "లాల్ సింగ్ చడ్డా". మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు)లో వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, అమిర్ ఖాన్ ప్రొడ‌క్షన్స్ పతకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తో పాటు కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీస్తున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారేలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కొరకు ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. 

ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య బాలరాజుగా కీలక పాత్రలో అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థీమ్ పోస్టర్ విడుదలైంది. మనం కథలోనా, కథే మనలోనా, ఏంటో ఈ విచిత్రం అనే పదాలతో తయారైనా ఈ పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షక వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

న‌టీన‌టులు : ఆమిర్ ఖాన్, క‌రీనా కుమార్, నాగ చైత‌న్య త‌దిత‌రులు.
సాంకేతిక నిపుణులు
స‌మ‌ర్ప‌ణ – మెగాస్టార్ చిరంజీవి
బ్యాన‌ర్లు – వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్
నిర్మాత‌లు – ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే
ద‌ర్శ‌క‌త్వం – అద్వైత్ చంద‌న్
సంగీతం – ప్రీతిమ్
భార‌తీయ చిత్రానుక‌ర‌ణ – అతుల్ కుల్ క‌ర్ణి