ల్యాబ్‌‌‌‌‌‌‌‌ డైమండ్‌‌‌‌‌‌‌‌కు ముందు ముందు మంచి గిరాకీ

ల్యాబ్‌‌‌‌‌‌‌‌ డైమండ్‌‌‌‌‌‌‌‌కు ముందు ముందు మంచి గిరాకీ

     తగ్గనున్న నేచురల్ డైమండ్ సప్లయ్‌

     గోల్డ్‌‌‌‌‌‌‌‌పై ఈ ఏడాది మంచి రిటర్న్స్‌‌‌‌‌‌‌‌: విపుల్ షా

న్యూఢిల్లీ :   ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ల్యాబ్‌‌‌‌‌‌‌‌ డైమండ్స్‌‌‌‌‌‌‌‌ (ల్యాబ్‌లో తయారు చేసిన డైమండ్స్‌) కు ఫుల్ డిమాండ్ ఉంటుందని జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ ప్రమోషన్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్ చైర్మన్‌‌‌‌‌‌‌‌ విపుల్‌‌‌‌‌‌‌‌ షా అంచనా వేస్తున్నారు. అలా అని ఇవి నేచురల్ డైమండ్స్‌‌‌‌‌‌‌‌ను భర్తీ చేయవని చెప్పారు.   ఫన్, ఫ్యాషన్ కోసం ల్యాబ్‌ డైమండ్స్‌‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ ఉంటుందని చెప్పారు. నేచురల్ డైమండ్స్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే వీటి ధరలు తక్కువగా ఉంటాయన్నారు. ఈ డైమండ్స్ సపరేట్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో  విస్తరిస్తాయని వెల్లడించారు. 

‘నేచురల్ డైమండ్స్‌‌‌‌‌‌‌‌ను కొనాలని  ఉన్నా అఫోర్డ్ చేయలేని వారి కోసం ల్యాబ్‌ డైమండ్స్‌‌‌‌‌‌‌‌‌  సరిపోతాయి.  నేచురల్ డైమండ్స్‌‌‌‌‌‌‌‌  ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌గా కూడా పనిచేస్తాయి. దీనిని బట్టి ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ డైమండ్స్ కొనాలనుకునే వారు మొదట ల్యాబ్‌ డైమండ్స్‌‌‌‌‌‌‌‌‌ను  కొనొచ్చు. ఆ తర్వాత నేచురల్ డైమండ్స్ వైపు చూడొచ్చు. ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ రెండూ కలిసి అందుబాటులో ఉంటాయి. ఒకదానిని మరోకటి భర్తీ చేసుకోవు’ అని షా వివరించారు.  అలానే  నేచురల్ డైమండ్స్ సప్లయ్  రాను రాను తగ్గిపోతుందని, కొత్త మైన్స్ లేకపోతే ఇవి దొరకడం కష్టమవుతుందని చెప్పారు. అందువలన ల్యాబ్‌ డైమండ్స్‌‌‌‌‌‌‌‌‌, నేచురల్ డైమండ్స్‌‌‌‌‌‌‌‌కు వేరు వేరు కన్జూమర్ల బేస్ ఉంటుందని అంచనా వేశారు. 

గోల్డ్‌‌‌‌‌‌‌‌ నుంచి భారీ రాబడులు...

ఈ ఏడాది గోల్డ్ మంచి రిటర్న్స్ ఇస్తుందని షా పేర్కొన్నారు. త్వరలో 10 గ్రాముల గోల్డ్ ధర రూ.65 వేలు– 70 వేల రేంజ్‌‌‌‌‌‌‌‌లోకి వెళుతుందని చెప్పారు. 20‌‌‌‌‌‌‌‌23 లో  గోల్డ్‌‌‌‌‌‌‌‌ నగల ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ మందగించాయని  అన్నారు. అలానే  డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌గా డిమాండ్ బాగుందని, ఫెస్టివల్ సీజన్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ సేల్స్ పెరిగాయని చెప్పారు. నగల ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌కు యూఎస్ పెద్ద మార్కెట్ అని, వడ్డీ రేట్లు పెరగడంతో అక్కడి కన్జూమర్లు నగలు కొనడం కొంత తగ్గించారని పేర్కొన్నారు. క్రిస్మస్‌‌‌‌‌‌‌‌, థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌ గివింగ్‌‌‌‌‌‌‌‌ వంటి పండుగల టైమ్‌‌‌‌‌‌‌‌లో  సేల్స్ పుంజుకున్నాయని వెల్లడించారు. 

కరోనా తర్వాత చైనీస్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ పూర్తిగా ఓపెన్ కాలేదని, రానున్న న్యూ ఇయర్ తర్వాత అక్కడ గోల్డ్ కొనడం పెరుగుతుందని అంచనా వేశారు. మొత్తంగా ఈ ఏడాది గోల్డ్ ధరలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ల కోసం ఇందులో డబ్బులు పెట్టొచ్చని చెప్పారు.  ప్రస్తుతం గ్లోబల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఔన్స్ గోల్డ్ (28.3 గ్రాములు) ధర   2,035 డాలర్ల దగ్గర ట్రేడవుతోందని,  ఇది 2,200–2,215 డాలర్ల వరకు పెరగొచ్చని షా అంచనా వేశారు. డిమాండ్‌‌‌‌‌‌‌‌తో పాటు డీ–డాలరైజేషన్‌‌‌‌‌‌‌‌, జియోపొలిటికల్ టెన్షన్ల కారణంగా గోల్డ్ రేట్లు పెరగొచ్చని అన్నారు. డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ఉందని,  దీపావళి టైమ్‌‌‌‌‌‌‌‌లో భారీ డిమాండ్ చూశామని షా వివరించారు. వెడ్డింగ్ సీజన్‌‌‌‌‌‌‌‌లో కూడా బంగారం సేల్స్ పెరుగుతాయని అంచనా వేశారు.