కాశీబుగ్గ/ వర్ధన్నపేట, వెలుగు: రాష్ర్ట వాలీబాల్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా వదర్ధన్నపేట మండలం ల్యాబర్తి హైస్కూల్ వ్యాయమ ఉపాధ్యాయుడు జలగం రఘువీర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట స్థాయి వాలీబాల్ బాలికల జూనియర్స్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసినట్లు చెప్పారు.
అనంతరం రఘువీర్‌ను వాలీబాల్అసోసియేషన్ ప్రెసిండెంట్ రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి హనుమంత్ రెడ్డి, కోశాధికారి కృష్ణ ప్రసాద్, హెచ్ఎం శైలజ, తోటీ ఉపాధ్యాయులు, స్టూడెంట్స్, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
