శామీర్ పేట, వెలుగు: గూడ్స్ వాహనం ఢీకొని బైక్‌పై వెళ్తున్న కూలీ మృతి చెందాడు. శామీర్‌పేటకు చెందిన వల్లెపు శ్రీనివాస్(52) రాయి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం నాల్సార్ జంక్షన్ నుంచి తన ఇంటి వైపు బైక్‌పై వెళ్తున్నాడు. శామీర్ పేట సమీపంలో అశోక్ లీలాండ్ గూడ్స్ వాహనం శ్రీనివాస్‌ను ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రగాయాలతో స్పాట్లో మృతి చెందాడు.

