బిల్డింగ్ పై నుంచి పడ్డ కూలీలు..ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

బిల్డింగ్ పై నుంచి పడ్డ కూలీలు..ఒకరు మృతి, మరొకరికి  తీవ్ర గాయాలు

గచ్చిబౌలి, వెలుగు: భవన నిర్మాణ పనులు చేస్తున్న ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు బిల్డింగ్​ పైనుంచి కింద పడ్డారు. ఇందులో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన ప్రకారం.. కొండాపూర్​ రాఘవేంద్ర కాలనీలోని జెమ్​ సర్వీస్​ సెంటర్​ వెనుక వైపు ఓ భవన నిర్మాణం జరుగుతోంది. 

చత్తీస్​గఢ్​కు చెందిన చంద్రకుమార్(33), జమ్మన సోన్​వానీ విక్కీ(23) ఈ భవన నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. శుక్రవారం నాలుగో అంతస్తులో పనిచేస్తుండగా గోవా కర్రల మీద నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని కొండాపూర్​లోని ప్రైవేట్​ దవాఖానకు తరలించగా చంద్రకుమార్​ కొద్దిసేపటికే మృతిచెందాడు. 

విక్కీ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్​పై కేసు నమోదు చేశారు.