కరోనా భయంతో కూలీలు పనికి వస్తలేరని..

కరోనా భయంతో కూలీలు పనికి వస్తలేరని..

కరోనా భయంతో వ్యవసాయ పనులు చేసేందుకు కూలీలు ముందుకు రావడం లేదు. దీంతో ఓ రైతు వినూత్నంగా ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించి తక్కువ టైం, తక్కువ ఖర్చులోనేే ఎక్కువ విస్తీర్ణంలో క్రిమిసంహారక మందు స్ప్రే చేస్తున్నాడు. నల్గొండ జిల్లా అన్నెపర్తికి చెందిన నర్సిరెడ్డి అనే రైతు టాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 500 లీటర్ల వాటర్ ట్యాంక్ బిగించాడు. ఇందులో క్రిమిసంహారక మందు కలిపాడు. కేవలం ఇద్దరు మనుషులను కూలలుగా పెట్టుకుని పత్తి చేనుకు మందు స్ప్రే చేస్తున్నాడు. సాధారణంగా మనుషులు అయితే రోజుకు నాలుగు నుంచి ఐదు ఎకరాల్లో స్ప్రే చేసే అవకాశం ఉండగా, ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా అయితే 35 నుంచి 40 ఎకరాలకు మందుకు స్ప్రే చేయవచ్చని చెబుతున్నాడు. – వెలుగు, నల్గొండ.