ఆరేళ్లలో రోజు కూలీల ఆత్మహత్యలు డబుల్

ఆరేళ్లలో రోజు కూలీల ఆత్మహత్యలు డబుల్

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడి

2019లో 32,563 మంది ఆత్మహత్య
వీరిలో 29,092 మంది మగవాళ్లే

న్యూఢిల్లీ: ఆరేళ్లలో రోజువారీ కూలీల సూసైడ్స్ డబుల్ అయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్ బీ) వెల్లడించింది. పని లేకపోవడం, తాగుడుకు బానిస కావడం, ఆర్థిక ఇబ్బందులు, డొమెస్టిక్ వయలెన్స్, అప్పులతోపాటు మానసిక సమస్యలతో సూసైడ్స్ చేసుకున్నట్లు తెలిపింది. 2019లో దేశవ్యాప్తంగా మొత్తం 1,39,123 మంది బలవన్మరణాలకు పాల్పడితే వీరిలో నాలుగింట ఒక వంతు డైలీ వేజర్స్ ఉన్నట్లు పేర్కొంది. ఇందులో వ్యవసాయ రంగంలో పని చేసే రోజువారీ కూలీలను లెక్కించలేదని చెప్పింది. ఆరేళ్లలో రోజువారీ కూలీల సూసైడ్స్ రెట్టింపు అయ్యి 23.4 శాతానికి పెరిగినట్లు తెలిపింది.

తమిళనాడులో హయ్యెస్ట్

తమిళనాడులో అత్యధికంగా 5,186 మంది రోజువారీ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్ సీఆర్ బీ పేర్కొంది. తర్వాతి స్థానంలో 4,128 మరణాలతో మహారాష్ట్ర, 3,964 డెత్స్ తో మధ్యప్రదేశ్, 2,858 మరణాలతో తెలంగాణ, 2,809 మరణాలతో కేరళ నిలిచాయి. 2014 తర్వాత రోజువారీ కూలీల యాక్సిడెంటల్ డెత్స్, సూసైడ్స్ డేటా కలెక్ట్ చేసింది. రోజువారీ కూలీల్లో ఎక్కువ మంది సూసైడ్ చేసుకున్నట్లు తేలింది. 2018లో వారి సూసైడ్ రేట్ 22.4 శాతం ఉంటే 2019లో 23.4 శాతంగా నమోదైంది. 2014లో సూసైడ్ రేట్ 12 శాతంగా ఉండేది. 2015లో 19.2 శాతం, 2016లో 19.2 శాతం, 2017లో 22.1 శాతంగా నమోదైంది. 2014 నుంచి 2019 వరకు డైలీ వేజర్స్ సూసైడ్ డబుల్ అయ్యింది. 15,735 నుంచి 32, 563కు పెరిగింది. సూసైడ్ చేసుకున్నవారిలో ఎక్కువ మంది మగవాళ్లే ఉన్నట్లు తేలింది. 2019లో మొత్తం 32,563 మంది డైలీ వేజర్స్ సూసైడ్ చేసుకుంటే వారిలో 29,092 మంది మగవాళ్లు ఉంటే, 3,467 మంది ఆడవాళ్లు, నలుగురు ట్రాన్స్
జెండర్స్ ఉన్నారు.

10.1 % మంది నిరుద్యోగులు

2019లో నిరుద్యోగుల సూసైడ్స్ 25 ఏళ్లలో తొలిసారి డబుల్ డిజిట్ (10.1 శాతం)కు చేరినట్లు ఎన్ సీఆర్ బీ తెలిపింది. కేరళలో అత్యధికంగా 10,963 మంది, మహారాష్ట్రలో 1,511, తమిళనాడు 1,368, కర్నాటక 1,293, ఒడిశాలో 858 మంది సూసైడ్ చేసుకున్నట్లు ఎన్ సీఆర్ బీ పేర్కొంది.  సూసైడ్స్  చేసుకున్నవారిని డైలీ వేజర్స్, హౌస్ వైవ్స్, వ్యవసాయ కూలీలుగా 9 కేటగిరీల్లో డివైడ్ చేసినట్లు తెలిపింది. డెత్స్ ను మాత్రం ప్రొఫెషనల్స్, ఉద్యోగులు, స్టూడెంట్స్, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ పర్సన్స్, రిటైర్‌‌ అయినవారు, నిరుద్యోగులు ఇతర వ్యక్తులుగా డివైడ్ చేసినట్లు పేర్కొంది.