కాలేజీల్లో కనిపించని PHD సీట్లు

కాలేజీల్లో కనిపించని PHD సీట్లు

యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరతతో క్యాంపస్.. అనుబంధ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో పీహెచ్ డీ సీటు ఒక్కటీ కూడా లేదు. దీంతో ఐదేళ్లుగా PHD కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు నిలిచిపోయాయి. గత నెలలో జరిగిన పాలక మండలి సమావేశంలో రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు సభ్యులు ఆమోదించడంతో ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో కూడా PHD కోర్సులకు అనుమతించాలని నిర్ణయించారు. OU పరిధిలో పలు పీజీ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీల్లో పరిశోధనలకు కావాల్సిన మౌలిక వసతులు... ల్యాబ్స్ అర్హత ఉన్న ఇద్దరు అధ్యాపకులున్నా కాలేజీలకు రీసెర్చ్ సెంటర్  కు అనుమతి ఇవ్వనున్నారు. ఐతే ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు PHD సీట్లు అమ్ముకునేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నాయి విద్యార్థి సంఘాలు.

ప్రభుత్వ యూనివర్సీటిలను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే విద్యను కార్పొరేట్ దోపిడీ వస్తువుగా మార్చిన ప్రభుత్వం... ఉన్నత విద్యను కూడా అదే విధంగా మార్చాలనే యోచనలో ఉందంటున్నారు విద్యావేత్తలు. ఉస్మానియా వర్సిటీ తాజా నిర్ణయంతో పరిశోధనల రంగంలో కూడా తీవ్రంగా అవినీతి పెరిగే అవకాశం ఉందంటున్నారు. యూనివర్సిటీల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త , కొత్త వివాధాలతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర చేస్తుందని ఆరోపిస్తున్నారు విద్యావేత్తలు.

ప్రైవేట్ కళాశాలల్లో PHD ప్రవేశపెట్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియా వర్సిటీలో ఆందోళన చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ఫేక్ డిగ్రీలు, నకిలీ సర్టిఫికెట్లతో రాజ్యమేలుతున్న ప్రైవేట్ కాలేజీల్లో  PHD కోర్సులు ప్రవేశపెట్టడంతో పరిశోధనా విద్యార్థులు ప్రైవైట్ యాజమాన్యాలు.. లెక్చరర్ల  చేతిలో అర్థిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ఓయూలో వెంటనే PHD నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు. అటానమస్  కాలేజీల్లో PHD ప్రవేశాలతో పాటు ప్రీ PHD పరీక్షలు, వైవా ఓయూ చేపడుతుందని అధికారులు చెప్తున్నారు. PHD లో ప్రవేశం పొందిన విద్యార్థి ఆయా ప్రైవేట్, అటానమస్  కాలేజీల అధ్యాపకుల పర్యవేక్షణలో పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. ప్రవేశం పొందిన విద్యార్థులు PHD ఫీజులు కూడా ప్రైవేట్... అటానమస్ కాలేజీలకు చెల్లించాలని.. ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో పీహెచ్ డీ చేసే విద్యార్థులకు ఓయూ క్యాంపస్ లో హాస్టల్  వసతి ఉండదంటున్నారు అధికారులు.