పెద్దపల్లి జిల్లాలో మానేరుపై బ్రిడ్జి కోసం ఎదురు చూపులు

పెద్దపల్లి జిల్లాలో మానేరుపై బ్రిడ్జి కోసం ఎదురు చూపులు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మానేరుపై బ్రిడ్జిలు లేక చాలా గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. గత సర్కార్ హయాంలో సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల, మానకొండూర్ మండలం వేగురుపల్లి వద్ద మానేరుపై 2016లో రూ.20 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టినా ఇప్పటి వరకు వినియోగంలోకి రాలేదు. 

ముత్తారం మండలం ఓడెడ్ సమీపంలో రూ. 24 కోట్ల అంచనాతో 2016లో బ్రిడ్జి నిర్మాణం మొదలైంది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే గతేడాది కూలిపోయింది. ప్రస్తుతం నిర్మాణ వ్యయం రూ. 50 కోట్లు పెరిగినట్లు తెలిసింది.   

అంతర్గాం–మంచిర్యాల మధ్య గోదావరిపై  2018లో రూ. 125 కోట్లతో ఓవర్ బ్రిడ్జి నిర్మించడానికి డీపీఆర్ ఆమోదించారు. కానీ ఇప్పటి వరకు నిర్మాణ పనులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ కాలేదు. ఈ బ్రిడ్జి పూర్తయితే మంచిర్యాల–పెద్దపల్లి జిల్లాల మద్య దాదాపు 30 కి.మీ దూరం తగ్గుతుంది. 

పెద్దపల్లి మండలం కొత్తపల్లి సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మించారు.  అండర్ పాస్ ద్వారా వాహనదారులు పెద్దపల్లి నుంచి ఓదెల, కాల్వశ్రీరాంపూర్, జమ్మికుంట, వరంగల్ వైపు వెళ్తుంటారు. వర్షాకాలం వచ్చిందటే ఈ అండర్ పాస్ వరద నీటితో మునిగిపోతుంది. నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు చాలా సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు.

lack of bridges over Maneru in Peddapalli district has become a problem for people of many villages