ఒక్కోసారి ఒక్కోలెక్క.. శాఖల మధ్య సమన్వయ లోపం

ఒక్కోసారి ఒక్కోలెక్క.. శాఖల మధ్య సమన్వయ లోపం

హైదరాబాద్, వెలుగు : కరోనా పాజిటివ్‌‌‌‌‌‌‌‌ ఏరియాల్లో  పటిష్ఠ చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం ఫెయిల్​ అవుతోంది. వైరస్ ​స్ప్రెడ్ ​కాకుండా చేయడంలో ప్రభుత్వ శాఖల మధ్య కో – ఆర్డినేషన్ లోపిస్తోంది. కంటెయిన్​మెంట్‌‌‌‌‌‌‌‌ జోన్ల ఏర్పాటు, కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌ కు టెస్ట్​లు వంటి వాటిపై రోజుకో పద్ధతిని అమలు చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది కన్ఫ్యూజ్​ అవుతున్నారు.  ప్రభుత్వం రోజుకో తీరుగా ఆదేశాలిస్తుండగా, ఎలా చెబితే అలా చేద్దామనే ధోరణిలో ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు.

మొదట ఇలా..

జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, వైద్యారోగ్యశాఖ కలిసి వైరస్ ​కంట్రోల్​కు కృషి చేస్తున్నాయి. బల్దియా ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ విభాగం బారికేడ్లు ఏర్పాటు చేస్తోంది. వైద్యారోగ్యశాఖ  హెల్త్​ టెస్ట్​లు, ఇంటింటి హెల్త్‌‌‌‌‌‌‌‌ సర్వే చేస్తోంది.   జోన్లలో ఉదయం, సాయంత్రం  టెస్టులు చేస్తుండగా, పోలీసులు  పర్యవేక్షిస్తున్నారు. అయితే జోన్ల ఏర్పాటులో వివిధ పద్ధతులు అమలు చేస్తున్నారు. మొదట పాజిటివ్‌‌‌‌‌‌‌‌ కేసు నమోదైన ఇంటి నుంచి కి.మీ రేడియస్‌‌‌‌‌‌‌‌లో క్లస్టర్లు పెట్టారు. నిర్వహణ సాధ్యం కాక  100 నుంచి 250 మీటర్ల పరిధిలోని ఇండ్లను మాత్రమే జోన్‌‌‌‌‌‌‌‌గా ఉంచారు. ఇలా హైదరాబాద్ లో 200లకు పైగా జోన్లు ఏర్పాటు చేశారు.

మార్చారిలా..

కేసులు తగ్గుతున్నాయని, కంటెయిన్​మెంట్ ​పీరియడ్‌‌‌‌‌‌‌‌ పూర్తయిందని అధికారులు 90 శాతం జోన్లు తొలగించారు. కరోనా సోకిన వ్యక్తులకు 20 రోజులైనా లక్షణాలు బయటపడట్లేదని తెలిసి కూడా 14 రోజులకే  జోన్లు ఎత్తేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, 15 చోట్ల మాత్రమే జోన్లు ఉన్నట్టు బల్దియా వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కేసులు నమోదైన చోట హోం క్వారంటైన్‌‌‌‌‌‌‌‌ కు మాత్రమే పరిమితం చేశారు. ప్రస్తుతం గ్రేటర్‌‌‌‌‌‌‌‌ లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి.  రెండువారాల్లోనే ఎల్‌‌‌‌‌‌‌‌బీనగర్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌లో 61 పాజిటివ్‌‌‌‌‌‌‌‌లు నమోదవడంతో అధికారులు అలర్టయ్యారు. వనస్థలిపురంలో పరిస్థితి తీవ్రంగా ఉండడంతో కంటెయిన్​మెంట్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ పరిధిని మళ్లీ పెంచారు. పాజిటివ్‌‌‌‌‌‌‌‌ నమోదైన ఇంటి నుంచి గల్లీ వరకు, మరికొన్ని ఏరియాల్లో ఇల్లు, అపార్ట్​మెంట్‌‌‌‌‌‌‌‌కు కంటైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పెట్టారు.  ఏదో ఓ పద్ధతి కాకుండా, ఒక్కోచోట ఒక్కో తీరు  అమలుపై అధికారుల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.

 మళ్లీ చేయాలంటూ..

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కేసుల పెరగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఇటీవల వనస్థలిపురంలో ఓ పాజిటివ్‌‌‌‌‌‌‌‌ పేషెంట్‌‌‌‌‌‌‌‌కు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్​చేసిన హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి టెస్ట్​లు చేయకపోవడం వివాదాస్పదమైంది. నాగోలు సాయినగర్‌‌‌‌‌‌‌‌లోని ఓ వ్యక్తికి పాజిటివ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. అతడి ఫ్యామిలీ మెంబర్స్​ఆరుగురికి టెస్ట్​లు చేయకుండా హోం క్వారంటైన్‌‌‌‌‌‌‌‌ మాత్రమే చేశారు. సింటమ్స్‌‌‌‌‌‌‌‌ లేకనే టెస్ట్​లు చేయలేదని చెప్తున్నారు. ప్రైమరీ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌లకు టెస్ట్‌‌‌‌‌‌‌‌లపై సిబ్బందిని అడిగితే వైద్యారోగ్యశాఖ అధికారిపై నెట్టేశాడు. క్షేత్రస్థాయి సిబ్బంది కో–ఆర్డినేషన్​కు నిదర్శనమిది. ఇప్పడు మళ్లీ ప్రైమరీ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌లకు కూడా టెస్ట్‌‌‌‌‌‌‌‌లు  చేస్తామని చెప్తున్నారు. ముందు ఎందుకు వద్దనుకున్నారో, ఇప్పుడు మళ్లీ ఎందుకు చేయమంటున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి.

చేయిదాటిపోతున్నా..

జియాగూడలో పరిస్థితి చేయిదాటిపోతు న్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు వివిధ బస్తీల్లో 26 పాజిటివ్​కేసులు నమోదవగా, ఇద్దరు వృద్ధులు చని పోయారు. కుల్సుంపురాలో వైరస్‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ తీవ్రంగా ఉంది. కానీ జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, వైద్యా రోగ్యశాఖ, పోలీసులు కంటెయిన్​మెంట్‌‌‌‌‌‌‌‌చ ర్యలపై ఫోకస్​చేయట్లేదు. ప్రమాదకర వాతా వరణంలో డ్యూటీ చేయాల్సి వస్తోందని ఓ పోలీస్​ అధికారి చెప్పాడు.