
శ్మశానవాటిక లేక 16 కిలోమీటర్లు శవాన్ని కాలినడకన మోసుకెళ్లారా గ్రామస్తులు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలంలోని రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంతో నాగరాల గ్రామం పదేళ్ల క్రితం ముంపునకు గురైంది. గ్రామంలోని పాత శ్మశానవాటిక రిజర్వాయర్‌లో మునిగిపోగా, ప్రభుత్వం చూపిన మూడు ప్రాంతాల్లో ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే శ్మశానవాటిక లేక సుదూర ప్రాంతాల్లో ఉన్న సొంత పొలాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తున్నారు. గ్రామంలో బుధవారం ఓ వృద్ధుడు చనిపోయాడు. గురువారం అంత్యక్రియల కోసం ఇలా 16 కి.మీ. మోసుకెళ్లారు. – పెబ్బేరు, వెలుగు