Son Of: డబ్బుకంటే కష్టపడే తత్వమే వారసత్వం.. తండ్రి–కొడుకుల బాండింగ్‌‌తో ‘సన్ ఆఫ్’

Son Of: డబ్బుకంటే కష్టపడే తత్వమే వారసత్వం.. తండ్రి–కొడుకుల బాండింగ్‌‌తో ‘సన్ ఆఫ్’

సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ  నిర్మించిన  చిత్రం ‘సన్ ఆఫ్’.  బత్తుల సతీష్ దర్శకుడు. వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇవాళ శుక్రవారం సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు నిర్మాతలు అశోక్ కుమార్, రామ సత్యనారాయణ, లయన్ వెంకట్, రామకృష్ణ గౌడ్  అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.

సాయి సింహాద్రి మాట్లాడుతూ ‘నాన్న మనకు  డబ్బుని కాకుండా కష్టపడే తత్వాన్ని వారసత్వంగా ఇవ్వాలని ఇందులో చూపించబోతున్నాం. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన చిత్రమిది’ అని అన్నాడు. ఈ మూవీ  జర్నీ తనకు గుర్తుండిపోతుందని హీరోయిన్ మీరా రాజ్ చెప్పింది. డిస్ట్రిబ్యూటర్ శోభారాణి, మ్యూజిక్ డైరెక్టర్ రిషి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.