‘స్వకృషి’కి ఉత్తమ సహకార డెయిరీ అవార్డు..NCDC ఆధ్వర్యంలో రీజినల్ అవార్డ్స్

‘స్వకృషి’కి ఉత్తమ సహకార డెయిరీ అవార్డు..NCDC ఆధ్వర్యంలో రీజినల్ అవార్డ్స్

​భీమదేవరపల్లి, వెలుగు: ముల్కనూర్ స్వకృషి మహిళా డెయిరీకి నేషనల్ కోపరేటివ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్(ఎన్‌సీడీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీజినల్ అవార్డ్స్ ఫర్ కోఆపరేటివ్ ఎక్సలెన్స్ అండ్ మెరిట్–-2025లో ఉత్తమ సహకార డెయిరీ అవార్డు దక్కింది. 

మహిళా రైతులకు ఉత్తమ సేవలందించడమే కాకుండా గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు అవార్డుకు ఎంపిక చేశారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీకి పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో టీజీఎస్‌సీహెచ్‌ బీ ఎండీ కృష్ణారావు, ఎన్‌సీడీసీ డైరెక్టర్ సాధు జాదవ్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీసీవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.