షారుఖ్ పాటకు పేషెంట్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

షారుఖ్ పాటకు పేషెంట్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

జవాన్(Jawan) సినిమా కలెక్షన్స్ సునామి ఇంకా ఆగడం లేదు. విడుదలై వారం గడుస్తున్నా సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు ఆడియన్స్. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్(Shah rukh khan) హీరోగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో జవాన్ సినిమా క్రేజ్ ఎక్కడి వరకు వెళ్లిందంటే.. పలువు సెలబ్రెటీస్ జవాన్ పాటలకు డాన్స్ చేస్తూ రీల్స్ కూడా చేస్తున్నారు. 

ప్రస్తుతం.. జవాన్ పాటల క్రేజ్ ఇంటర్నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోందో. తాజాగా షారుఖ్‌ లేడీ ఫ్యాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇటీవలే కోలుకున్న ఆమె బెడ్ పైనుండి లేచి..  జవాన్ సినిమాలోని చలేయా(Chaleya) పాటకు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. ఇక ఈ వీడియోను చూసిన షారుఖ్‌(Shah Rukh Khan) సైతం ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయ్యాడు.

  ఆ వీడియోకి రిప్లై ఇచ్చిన షారుఖ్.. ఇది చాలా బాగుంది.. ధన్యవాదాలు.. మీరు త్వరగా  కోలుకొని జవాన్‌(Jawan) సినిమా చూడండి. అంతేకాదు.. మీరు హాస్పిటల్ నుండి బయటకు వచ్చాక మరొక డ్యాన్స్ వీడియో చేయాలి. దానికోసం నేను ఎదురు చూస్తాను.. ల‌వ్ యూ అంటూ రాసుకొచ్చాడు షారుఖ్. ప్రస్తుతం షారుఖ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.