గోవాలో బీజేపీ అంతమే మా టార్గెట్

గోవాలో బీజేపీ అంతమే మా టార్గెట్

గోవాలో బీజేపీ అంతమే తమ టార్గెట్ అన్నారు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గోవాలో బీజేపీని ఓడించేందుకు అందరూ ఒక్కటి కావాలన్నారు. గోవాను బయటి వ్యక్తులు కంట్రోల్ చేయాలని తాను కోరుకోవడంలేదన్నారు. తాను బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చానని... తనకు బీజేపీ నుంచి క్యారెక్టర్ సర్టిఫికెట్ అవసరంలేదన్నారు.

లఖీంపూర్ ఘటనకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని మమత డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సిట్‌ దర్యాప్తు నివేదికపై ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ఎందుకు చర్చించరని ఆమె ప్రశ్నించారు. కాగా, ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ దాడి ఘటనకు సంబంధించి సిటీ రిపోర్టు కీలక విషయాలను వెల్లడించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే రైతులపై దాడి జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగిందని.. నిర్లక్ష్యంతోకాదని చెప్పింది. నిందితులపై హత్యాయత్నం అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతించాలని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ను సిట్ కోరింది. ప్రస్తుతం నిందితులపై సెక్షన్ 279, 338, 304A కింది కేసులు నమోదు చేశారు. వాటిస్థానంలో హత్యాయత్నం సెక్షన్ 307, 326, 34 ను చేర్చాలని మేజిస్ట్రేట్ ను కోరారు సిట్ అధికారులు .