లఖింపూర్ కేసు.. సాక్షులకు సెక్యూరిటీ ఇవ్వండి

లఖింపూర్ కేసు.. సాక్షులకు సెక్యూరిటీ ఇవ్వండి

ఉత్తర్ ప్రదేశ్ లఖింపూర్ ఖేరి ఘటనపై విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. విచారణ సందర్భంగా 68 మంది సాక్షుల్లో 30 మంది స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లు కోర్టుకు తెలిపింది యూపీ సర్కార్. ఇందులో 23 మంది ఘటనను ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారని కోర్టుకు తెలిపింది. ఐతే దీనిపై యూపీ సర్కార్ పలు ప్రశ్నలు వేసింది సుప్రీంకోర్టు. ర్యాలీలో వందలాది మంది రైతులు పాల్గొంటే 23 మందే ప్రత్యక్ష సాక్షులు  ఉన్నారా అని యూపీ సర్కార్ ను ప్రశ్నించింది.  ఘటనలో సాక్షులకు సెక్యూరిటీ ఇవ్వాలని యూపీ సర్కార్ ను ఆదేశించింది. సాక్షుల వాంగ్మూలాలను వీలైనంత త్వరగా నమోదు చేయాలని సూచించింది. విలేకరి కశ్యప్, శ్యాం సుందర్ ల మృతి పై నివేదిక ఇవ్వాలని కోరింది.