జపాన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో సెమీస్‌‌‌‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్‌

 జపాన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో సెమీస్‌‌‌‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్‌

కుమమోటో: ఇండియా టాప్‌‌‌‌ షట్లర్‌‌‌‌ లక్ష్యసేన్‌‌‌‌ జపాన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ఫైనల్లో ఏడోసీడ్‌‌‌‌ లక్ష్య 21–13, 21–17తో మాజీ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ లో  కీన్ యూ (సింగపూర్‌‌‌‌)పై గెలిచాడు. 40 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ రెండు గేమ్‌‌‌‌ల్లోనూ సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చూపెట్టాడు. ఫలితంగా లో కీన్ తో తలపడిన పది మ్యాచ్‌ల్లో ఏడోసారి విజయం సాధించాడు.

4–4తో తొలి గేమ్‌‌‌‌ను మొదలుపెట్టిన లక్ష్య క్రాస్‌‌‌‌ కోర్టు షాట్లతో 11–8 ఆధిక్యంలో నిలిచాడు. ఆ వెంటనే వరుసగా ఆరు పాయింట్లు సాధించి 18–9తో వెనుదిరిగి చూసుకోలేదు. రెండో గేమ్‌‌‌‌లో లోకీన్‌ నుంచి కొద్దిగా ప్రతిఘటన ఎదురైంది. దీంతో స్కోరు 9–9తో సమమైంది. 

కానీ వెంటనే తేరుకున్న లక్ష్య బలమైన స్మాష్‌‌‌‌లతో 15–9 లీడ్‌‌‌‌లోకి వచ్చాడు. కీన్ యూ కూడా మెరుగ్గా ఆడటంతో 17–18తో నిలిచాడు. ఈ దశలో వరుసగా మూడు పాయింట్లు గెలిచిన లక్ష్య గేమ్‌‌‌‌, మ్యాచ్‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. సెమీస్‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌.. 13వ ర్యాంకర్‌‌‌‌ కెంటా నిషిమోటో (జపాన్‌‌‌‌)తో తలపడతాడు.