సింగపూర్ ఓపెన్ సూపర్– 750 టోర్నీలో సింధు, లక్ష్యసేన్‌‌‌‌ పై ఆశలు

సింగపూర్ ఓపెన్ సూపర్– 750 టోర్నీలో సింధు, లక్ష్యసేన్‌‌‌‌ పై ఆశలు

సింగపూర్: ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌‌‌‌.. సింగపూర్ ఓపెన్ సూపర్– 750 బ్యాడ్మింటన్ టోర్నీకి రెడీ అయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో ఈ ఇద్దరు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. సింధుకు తొలి రౌండ్‌‌‌‌లో పుత్రి కుసుమవర్దాని (ఇండోనేసియా) నుంచి పోటీ ఎదురుకానుంది. గాయాల నుంచి కోలుకున్న తెలుగమ్మాయి ఇటీవల థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో క్వార్టర్స్‌‌‌‌ వరకు చేరింది. దాంతో ఈ టోర్నీలో మరింత మెరుగైన ప్రదర్శన చూపెట్టాలని భావిస్తోంది. 

మెన్స్ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌.. గుయాంగ్ జు (చైనా)తో తలపడనున్నాడు.  ఆయుష్‌‌‌‌ శెట్టి.. విక్టర్‌‌‌‌ లై (కెనడా)తో, శ్రీకాంత్‌‌‌‌.. కీన్‌‌‌‌ యు (సింగపూర్‌‌‌‌)తో, హెచ్‌‌‌‌.ఎస్‌‌‌‌. ప్రణయ్‌‌‌‌.. జొనాథన్‌‌‌‌ క్రిస్టీ (ఇండోనేసియా)తో అమీతుమీ తేల్చుకోనున్నారు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో ఉన్నతి హుడా.. తొమోకా మియాజాకీ (జపాన్‌‌‌‌)తో తన పోరాటాన్ని మొదలుపెట్టనుంది. 

మాళవిక బన్సోద్‌‌‌‌.. లిన్‌‌‌‌ హియాంగ్‌‌‌‌ తీ (చైనీస్‌‌‌‌తైపీ)ని ఎదుర్కోనుంది. మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌.. చెన్‌‌‌‌ జియి–ప్రెస్లీ స్మిత్‌‌‌‌ (అమెరికా)తో ఆట మొదలుపెట్టనున్నారు. హరహరన్‌‌‌‌–అర్జున్‌‌‌‌ జోడీ.. టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్‌‌‌‌)తో తలపడతారు. విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో కవిప్రియ– సిమ్రాన్‌‌‌‌, రుతాపర్ణ–శ్వేతాపర్ణ, అశ్విని భట్–శిఖా గౌతమ్ జోడీలు కూడా తొలి రౌండ్‌‌‌‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.