ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–750 టోర్నీలో లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌ బోణీ

ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–750 టోర్నీలో లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌ బోణీ

పారిస్‌‌‌‌‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌.. ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–750 టోర్నీలో బోణీ చేశాడు. మంగళవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌ 15–21, 21–15, 21–3తో కెంటా సునెయమా (జపాన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌ సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ జోడీ 21–13, 24–22తో ఓంగ్‌‌‌‌‌‌‌‌ యూ సిన్‌‌‌‌‌‌‌‌–టియో ఈ హీ (మలేసియా)పై గెలిచి రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టారు. 

గత ఎనిమిది మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఇండియా జోడీకి ఇది ఐదో విజయం కావడం విశేషం. విమెన్స్‌‌‌‌‌‌‌‌లో ట్రీసా జోలి–గాయత్రి గోపీచంద్‌‌‌‌‌‌‌‌ 16–21, 21–19, 21–17తో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టోపై గెలిచి ముందంజ వేశారు.