Lal Salaam: రజిని కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్.. లాల్ సలామ్ కలెక్షన్స్ ఇంత దారుణమా!

Lal Salaam: రజిని కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్.. లాల్ సలామ్ కలెక్షన్స్ ఇంత దారుణమా!

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్(Lal Salaam). రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్(Aishwarya Rajinimath) డైరెక్షన్ లో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీలో విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్(Vikranth) హీరోలుగా నటించారు. జైలర్(Jailer) లాంటి బ్లాక్ బస్టర్ తరువాత రజినీకాంత్ కనిపిస్తున్న సినిమా కావడంతో లాల్ సలామ్ పై మంచి అంచనాలు క్రియేట్ అవగా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

అయితే విడుదల ముందు ఏర్పడ్డ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమయింది ఈ మూవీ. మొదటి ఆట నుండే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటీవ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు ఆడియన్స్. దీంతో మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. మొదటిరోజు కేవలం రూ.7 కోట్లు మాత్రమే రాబట్టింది. రజిని గత సినిమాలతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఇక వారం రోజుల్లో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్ల గ్రాస్.. రూ.15 కోట్లు మాత్రమే రాబట్టింది లాల్ సలామ్. అలా చూసుకుంటే రజినీకాంత్ కెరీరి లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా లాల్ సలామ్ నిలువనుందని చెప్పొచ్చు.

ఇక రజినీకాంత్ తరువాతి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తతం ఆయన దర్శకుడు జ్ఞానవేల్ తో వెట్టయ్యన్ అనే సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.