చందు నాయక్ హత్యకు భూ తగాదాలే కారణం

చందు నాయక్ హత్యకు భూ తగాదాలే కారణం

మలక్ పేటలో  కాల్పుల కేసులో  విచారణను స్పీడప్ చేశారు పోలీసులు. సీపీఐ నేత చందునాయక్ పై   కాల్పులు జరిపింది రాజేష్, సుధాకర్, శివ,బాషా గా గుర్తించిన పోలీసులు..భూ తగాదాల వల్లే చందు నాయక్ ను కాల్చినట్లు తేల్చారు పోలీసులు.  కాల్పులకు కుంట్లూర్ లోని భూ తగాదాలే కారణమని చెప్పారు.  

గత కొద్ది రోజుల నుంచి రాజేశ్ కి  చందు  నాయక్ కి మధ్య విభేదాలు ఉన్నాయి.  కుంట్లూరులోని రావి నారాయణరెడ్డి నగర్ లో చందు నాయక్ అనుచరులు గుడిసెలు వేయడంతో రాజేశ్ కక్ష పెంచుకున్నాడు.  సీపీఐ  పార్టీలో ప్రస్తుతం కౌన్సిల్ నెంబర్ గా ఉన్న చందు నాయక్ తో కలిసి తిరిగిన రాజేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితులను  కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు  సీపీఐ నాయకులు పోలీసులను కోరారు.

నిందితులను పట్టుకోవడానికి పది టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు పోలీసులు. నిందితులు చౌటుప్పల్ వైపు పారిపోయినట్టు సీసీ కెమెరాల్లో గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలంలో ఏడు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. చందు నాయక్ తనకు ప్రాణహాని ఉన్న పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.  ఇవాళ  చందు నాయక్ స్వగ్రామం నర్సాయపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. 

జులై 15న ఉదయం మలక్ పేటలోని పార్క్ ముందు చందు నాయక్ ను దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. పక్కా ప్లాన్ ప్రకారమే  ఏడు రౌండ్లు కాల్పులు జరిపిన  దుండగులు పారిపోయారు.