
సూర్యాపేట జిల్లాలో భారీ భూబాగోతం వెలుగు చూసింది. మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని 540 సర్వే నంబర్ లో 6,239.07 ఎకరాల భూములు ఉండగా, ఏకంగా12 వేల ఎకరాలకు పైగా భూములకు పట్టాలు పుట్టుకొచ్చాయి. అంటే సుమారు 6 వేల ఎకరాల వరకు అక్రమ పట్టాలు సృష్టించారు. ఇలా అక్రమ పట్టాలు చేయించుకున్నవారిలో అత్యధికంగా అధికార పార్టీ లీడర్లు, ఆ తర్వా తి స్థా నంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వీరిలో పలువురు బ్యాంకుల్లో దొంగ పాస్ బుక్ లు తనఖాపెట్టి కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్నారు. కాగా, కొన్నిచోట్ల అసలుదారులపై అక్రమార్కులు ఇటీవల దాడులకు దిగడంతో బాధితులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తీగలాగితే భూబాగోతం డొంక కదిలింది. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు తహసీల్దార్లపై కలెక్టర్ సస్పె న్షన్ వేటువేయడం సంచలనం రేకెత్తిస్తోంది.
Read more
* వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్.. ఏడాది పాటు
* నిజామాబాద్ లో దారుణం.. యువతిపై 11 మంది గ్యాంగ్ రేప్
బ్యాంకులకూ టోకరా..
పెదవీడు రెవెన్యూ గ్రామ పరిధి 540 సర్వే నెంబర్ లో 6,239.07 ఎకరాల భూములున్నాయి. ఇందులో 2,411.27 ఎకరాలు అటవీ భూమి కాగా, 1,876.1 ఎకరాలు నాగార్జున సాగర్ ముంపు బాధితులకు, పునరావాసానికి 30.25 ఎకరాలు గతంలో కేటాయించా రు. మరో522.05 ఎకరాల భూముల్లో వివిధ ఫ్యాక్టరీలు నడుస్తున్నా. మరో1,400.03 ఎకరాల భూమి ప్రభుత్వం పేరిట ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ సర్వే నంబర్ లో భూవిస్తీర్ణం ఎక్కువ కావడం, ప్రభుత్వ, అటవీ భూములు, నాగార్జునసాగర్ ముంపు బాధితులకు కేటాయించిన భూములు ఉండడంతో అక్రమార్కులు కన్నేశారు. రెవెన్యూ ఆఫీసర్ల సహకారంతో 6,239 ఎకరాలకుగాను అదనంగా మరో 6 వేల ఎకరాలకు అక్రమ పట్టాలు సృష్టించారు. ఇప్పటివరకు వీరెవరూ మోఖా మీద లేకున్నా ఇటీవలే పొజిషన్ కు వస్తూ అసలుదారులపై దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో నే పలువురు బాధితులు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన రంగంలోకి దిగి 540 సర్వే నంబర్ పై కూపీ లాగ డంతో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్రమార్కులు 200 ఎకరాలకు సంబంధిం చిన పట్టాపాస్ బుక్ లను వివిధ బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ. 3 కోట్లు రుణాలుగా తీసుకున్న విషయం బయటకు వచ్చింది.
Read more
* ఆస్పత్రిలో కన్నుమూసి.. అంత్యక్రియల్లో కళ్లు తెరిచింది
* పెన్షన్ తెచ్చుకోనీకిపోతె.. 92 మందికి కరోనా
తహసీల్దా ర్లపై వేటు
సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ భూములను ఇతరులకు పట్టాలు చేశారనే ఆరోపణలపై ఇద్దరు తహసీల్దార్లను ఈ నెల 21న జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి సస్పెం డ్ చేశారు. సస్పెండ్ అయినవారిలో ప్రస్తుత మఠంపల్లి తహసీల్దార్ వేణుగోపాల్, గతంలో ఇక్కడ పని చేసి ప్రస్తుతం గరిడేపల్లి తహసీల్దార్ గా వెళ్లిన చంద్రశేఖర్ ఉన్నారు.ఈ తహసీల్దార్లపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆఫీసర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఘటనలో గతంలో ఇక్కడ పనిచేసిన వెళ్లిన మరో ఇద్దరు తహసీల్దార్లు , పలువురు వీఆర్వోల హస్తం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
అక్రమార్కులందరిపై చర్యలు
పెదవీడు గ్రామంలోని 540 సర్వే నంబర్ లో జరిగిన భూబాగోతంపై సమగ్ర విచారణకు ఆదేశించాం . ఈ సర్వే నంబర్లో 6,200 ఎకరాల భూములుం టే ఏకంగా 12 వేల ఎకరాలకు పైగా పట్టాలు చేసినట్లు మా ప్రాథమిక విచారణలో తేలింది. ఆర్డీవో ఆధ్వర్యం లో సమగ్ర సర్వే చేస్తున్నాం. భూమి లెక్క తేల్చి శాశ్వత హద్దు లు ఏర్పాటు చేస్తాం . అక్రమాలకు పాల్పడిన అందరిపై చర్యలు తీసుకుంటాం.
– వినయ్ కృష్ణా రెడ్డి,కలెక్టర్, సూర్యాపేట జిల్లా