
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: లేఅవుట్లలో ప్రజావాసరాల కోసం కేటాయించిన ఓపెన్ ప్లేస్‌లను ఎవరైనా కబ్జా చేసినా, అక్రమ రిజిస్టేషన్ లు చేసుకున్నా ఊరుకోబోమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తన ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు.
అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 376లో ఉన్న వెంచర్ లో సుమారు రూ.100 కోట్ల విలువైన 70 వేల గజాల ఓపెన్ ప్లేస్‌ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్లాట్లు కొన్న వారి మౌలిక వసతులకు ఉపయోగపడే స్థలాలను మాయం చేస్తే ఎంతటి వారైనా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.