భూ సంబంధ లావాదేవీలే కారణం

భూ సంబంధ లావాదేవీలే కారణం

అడ్వకేట్ మల్లారెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులు అరెస్టయ్యారు. వారిలో మైనింగ్ వ్యాపారులు గోనెల రవీందర్ , పిండి రవి యాదవ్,  బిల్డర్ వంచ రామ్మోహన్ రెడ్డి, RMP డాక్టర్ తడక రమేష్ ఉన్నారని పోలీసులు తెలిపారు. అరెస్టు అనంతరం రిమాండుకు పంపినట్టు అధికారులు వెల్లడించారు. అడ్వకేట్ హత్యకు  మైనింగ్ విషయంలో నర్సంపేటకు చెందిన గోనెల రవీందర్, మల్లంపల్లి గ్రామానికి చెందిన పిండి రవి యాదవ్, కొడిశ లకుంట కు చెందిన వంచ రామ్మోహన్ రెడ్డికి ఉన్న భూ సంబంధ లావాదేవీలే కారణమని తెలుస్తోంది. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న కర్నూలు జిల్లాకు చెందిన కిరాయి రౌడీలను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశామని  జిల్లా ఎస్పీ చెప్పారు.

వరంగల్‌‌, ములుగు కోర్టుల్లో అడ్వకేట్‌‌గా ప్రాక్టీస్ చేస్తున్న ములగుండ్ల మల్లారెడ్డి(65) దారుణ హత్యకు గురైన విషయం తెలిసింద్. మైనింగ్ మాఫియాకు చెందిన వ్యక్తులు ఆయనను కారుతో అడ్డగించి.. అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. కాగా ఈ హత్యపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఇటీవల మల్లారెడ్డి హత్యకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.