ల్యాండ్ రోవర్ డిఫెండర్-007 బాండ్ ఎడిషన్

ల్యాండ్ రోవర్ డిఫెండర్-007 బాండ్ ఎడిషన్

హాలీవుడ్ ఆల్ టైం సూపర్ హిట్ కాన్సెప్ట్ మూవీ జేమ్స్‌ బాండ్‌ 25వ సినిమా ‘నో టైమ్‌ టు డై' విడుదలను పురస్కరించుకుని కొత్త లాండ్‌ రోవర్‌ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా లిమిడెట్‌ ఎడిషన్‌గా. అనేక కొత్త ఫ్యూచర్స్ తో  డిఫెండర్‌ 007 రేర్‌ బ్యాడ్జ్ తో లాండ్‌ రోవర్‌ కొద్ది మందికే పరిమితం కానుంది. ఎంపిక చేసిన కేవలం 300 మందికి మాత్రమే అమ్ముతున్నట్లు ప్రకటించడంతో హైప్ ఏర్పడింది. కారు బయటి మోడల్ లుక్ మొదలు, వీల్స్‌ అలాగే కారు లోపల అనేక కొత్త ఫ్యూచర్స్‌ ఉంటాయని తెలుస్తోంది. 
జేమ్స్‌ బాండ్‌ సినిమాలో ఉపయోగించిన ఈ మోడల్‌ రోడ్డుపై పరుగులు తీస్తే ఆ స్టయిలే వేరు అని అంటోంది ల్యాండ్ రోవర్. ఇంజిన్ పికప్ స్పీడ్ కేవలం 5.4 సెకన్లలో 100 కిలోమీటర్ల  స్పీడు అందుకుంటుంది. టాప్‌ స్పీడు గంటకు 240 కిలోమీటర్ల వేగంతో రేంజ్‌ రోవర్‌ క్లాసిక్‌, ల్యాండ్‌ రోవర్‌ సిరీస్‌-IIIని కూడా జేమ్స్‌ బాండ్ మూవీలో ఉపయోగించినట్లు ల్యాండ్ రోవర్ కంపెనీ ప్రకటించింది.