కెకె లైన్లో భారీగా విరిగిపడ్డ కొండచరియలు

కెకె లైన్లో భారీగా విరిగిపడ్డ కొండచరియలు

విశాఖ పట్నం కెకె రైల్వే లైన్లో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో బోర్రాగుహలు-చిమిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ రెండు స్టేషన్ల మధ్య 65వ కిలోమీటర్ దగ్గర ఇవాళ (మంగళవారం) కొండచరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లను తొలగించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఈ మార్గం గుండా గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఛత్తీస్ గఢ్ లోని బైలాదిల్లా గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ఈ మార్గంలో తీసుకువస్తారు. రైళ్లు నిలిచిపోవడంతో  ప్రస్తుతం  ఇనుప ఖనిజ రవాణ నిలిచిపోయింది.