AIG తో పోటీ పడేలా ప్రభుత్వ ఆస్పత్రులు.. 2025 నాటికి 7 వేల బెడ్స్తో నిర్మిస్తాం: సీఎం రేవంత్

AIG తో పోటీ పడేలా ప్రభుత్వ ఆస్పత్రులు.. 2025 నాటికి 7 వేల బెడ్స్తో నిర్మిస్తాం: సీఎం రేవంత్

AIG  హాస్పిటల్ తో పోటీ పడేలా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చి దిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  2025 చివరి నాటికి 7 వేల బెడ్స్తో ఆస్పత్రులు నిర్మిస్తామని చెప్పారు. అందులో భాగంగా హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో 2700 బెడ్స్ తో ఉస్మానియా హాస్పిటల్, నిమ్స్ లో 2 వేల బెడ్స్ తో కొత్త బ్లాక్ నిర్మాణం, వరంగల్ 2 వేల బెడ్స్ తో కొత్త ఆస్పత్రి, ఎల్బీనగర్, సనత్ నగర్, టిమ్స్ లో వెయ్యి బెడ్స్ తో కొత్త ఆస్పత్రులు నిర్మించనున్నట్లు చెప్పారు.  AIG ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడిన సీఎం .. హైదరాబాద్ బంజారాహిల్స్ లో మరో బ్రాంచ్ ప్రారంభించడం శుభ పరిణామం అని అభినందించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ స్పీచ్:

  • మెడికల్ హబ్ గా తెలంగాణ మారింది 
  • ప్రపంచం నలుమూలల నుంచి వైద్యం కోసం హైదరాబాద్ వస్తున్నారు
  • డ్రగ్ ప్రొడక్షన్ లో తెలంగాణ అగ్రగామిగా ఉంది
  • కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ లు ఇక్కడే తయారయ్యాయి
  • IDPL నుంచి ఎంతో మంది సైంటిస్టులు సేవలందిస్తున్నారు
  • క్యాన్సర్ ఎక్స్ పర్ట్ డాక్టరర్ నోరీని సలహాదారుగా నియమించాం
  • ఆయన సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుంది..
  • హెల్గ్ సమస్యలు వచ్చాక వైద్యం చేయడం కాదు.. ముందే కంట్రోల్ చేసేలా రీసర్చ్ ఉండాలి
  • సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త కోసం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది
  • డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుంది
  • మీ సమయాన్ని మీరు కేటాయించుకుంటూనే.. ప్రభుత్వంలో పాల్పంచుకోవాలి
  • జననీ మిత్ర యాప్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది
  • సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉండే 63 లక్షల మంది మహిళలకు ఐడీ కార్డ్ ఇవ్వాలి
  • మహిళా హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది
  • మిస్ వరల్డ్ కాంపిటెంట్స్ కు ఏఐజీ ఆస్పత్రిని విజిట్ చేయాలని చెప్పాం
  • ఎందుకంటే మన స్ట్రెంత్ ఏంటో చూపించాలని .. అందుకోసం ఏఐజీని విజిట్ చేయాలని సూచించా
  • మిస్ ఇండియా కాంపిటేషన్స్ తో మన నగరం ప్రతిష్ట పెరిగింది
  • హైదరాబాద్ హైలీ ప్రొటెక్టెడ్ సిటీ అని ఇక్కడ ఏర్పాటు చేశాం
  • ఆరోగ్య శ్రీ కింద మరిన్ని నిధులు పెంచాం
  • కార్పోరేట్ రంగంతో పాటు ప్రభుత్వంలో కూడా 
  • ప్రభుత్వం మొతటి ప్రాధాన్యం విద్య, వైద్యం
  • ప్రభుత్వ ఆస్పత్రులంటే బతకటానికి కాదు.. చావటానికే.. అనే అభిప్రాయాన్ని మార్చాలనే యోచనలో ఉన్నాం
  • డాక్టరర్లకు విజ్ఞప్తి.. సంవత్సరంలో ఒక్క నెల.. సోషల్ రెస్పాన్సిబులిటీ కింద పనిచేయాలని రెక్వెస్ట్
  • జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం మేము చేసినట్లే.. మీరు కూడా చేయండి
  • ఎక్కడ చేస్తారనేది మీ ఇష్టం..
  • ఐటీ, జీసీసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ .. మొదలైన అన్ని రంగాల్లో బెస్ట్ సిటీ హైదరాబాద్
  • హైదరాబాద్ కు డైరెక్ట్ వచ్చేందుకు విమాన ప్రయాణం లేదు..
  • మిడిల్ ఈస్ట్ నుంచి డైరెక్ట్ పేషెంట్స్ వచ్చేలా విమానాలను ఏర్పాటు చేయాలని ఏవియేషన్ మినిస్ట్రీని కోరాం..
  • యంగెస్ట్ పాపులేషన్ ఇండియా.. ఓల్డె్స్ట్ పాపులేషన్ జపాన్.. రెండింటి మధ్య లింక్ ఏర్పాటు చేయాలి..
  • జపాన్ లో నర్సింగ్ కు మంచి డిమాండ్ ఉంది.. అవకాశాలను అందిపుచ్చుకోవాలి
  • 2047 కు 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నాం
  • రెవెన్యూ, లా అండ్ ఆర్డర్, డ్రగ్ కంట్రోల్.. తెలంగాణ నెంబర్ వన్. 
  • తెలంగాణకు సక్సెస్ స్టోరీలు ఉన్నాయి..
  • ఈ బ్రాండింగ్ ను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది..
  • అందులో నాగేశ్వర్ రెడ్డి పాత్ర ఉండాలి..