
న్యూఢిల్లీ: తన హైడ్రోకార్బన్ బిజినెస్‌కు మిడిల్ ఈస్ట్‌లోని క్లయింట్ నుంచి మెగా ఆర్డర్ వచ్చినట్లు లార్సెన్ అండ్ టూర్బో (ఎల్ అండ్ టి)తెలిపింది. అయితే ఇది కాంట్రాక్ట్ విలువను వెల్లడించలేదు. విలువ రూ. 10 వేల కోట్లు–-15 వేల కోట్ల మధ్య ఉన్నప్పుడు దానిని "మెగా" ఆర్డర్‌గా పిలుస్తారు.
మెగా ఆఫ్‌షోర్ ఆర్డర్ కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను అందుకున్నామని కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా కొత్త భారీ ఆఫ్షోర్ ప్లాట్‌ఫారాన్ని నిర్మించడంతోపాటు ప్రస్తుత ఫెసిలిటీలను ఆధునీకరించాలి. కొత్త కస్టమర్ నుంచి వచ్చిన ఈ మెగా ఆర్డర్ మా సామర్థ్యాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపును సూచిస్తుందని కంపెనీ తెలిపింది.