‘మనయాత్రి’తో మెట్రో ఒప్పందం

‘మనయాత్రి’తో మెట్రో ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: ప్రయాణికులకు ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీని పెంచేందుకు ఎల్​అండ్​టీ, మెట్రో ‘మనయాత్రి’ కంపెనీతో టైఅప్​అయింది. శుక్రవారం ఎల్అండ్ టీ, మెట్రో అధికారులు మనయాత్రి ప్రతినిధులతో టీ హబ్​లో ఒప్పందం చేసుకున్నారు. 

ఎల్​అండ్​టీ ఎండీ కేవీబీరెడ్డి మాట్లాడుతూ.. మనయాత్రితో భాగస్వామ్యం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేవారు. మనయాత్రి సీఈఓ మాగిజన్ సెల్వన్ మాట్లాడుతూ తమ సంస్థ బెంగుళూరు, కొచ్చిలో సేవలు అందిస్తుందని చెప్పారు. తమ యాప్​లో రైడ్​చేసే మెట్రో ప్రయాణికులకు 10 శాతం రాయితీ వస్తుందని తెలిపారు.