లాఅండ్ ఆర్డర్కు టాప్ ప్రయారిటీ : సీపీ సాయిచైతన్య

లాఅండ్ ఆర్డర్కు టాప్ ప్రయారిటీ : సీపీ సాయిచైతన్య
  • సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​,  వెలుగు : జిల్లాలో లాఅండ్ఆర్డర్ పరిరక్షణకు టాప్​ ప్రయారిటీ ఇవ్వాలని సీపీ సాయిచైతన్య తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు ప్రకటన రిలీజ్​ చేశారు. కొత్త ఏడాది రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తామన్నారు. ఉత్తమమైన రిజల్ట్​సాధించడానికి ప్రజలు తమతో కలిసి రావాలన్నారు. శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వచ్చి జిల్లాతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.  కొత్త ఏడాది ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.

రిటైర్డ్​ సిబ్బందికి​ వీడ్కోలు

జిల్లా పోలీస్ శాఖలో పనిచేసి బుధవారం రిటైర్మెంట్​ తీసుకున్న నలుగురిని సీపీ సాయిచైతన్య సన్మానించారు. కె.చందర్​సింగ్​ రాథోడ్​ (సీఐ, సీసీఎస్​), చెన్నుపల్లి ముక్తేశ్వర్​రావు (ఏఆర్​ఎస్​ఐ), పి.సంజీవ్​ (హెడ్​ కానిస్టేబుల్, ధర్పల్లి​), ఆర్​.శివకుమార్​ (హెడ్​ కానిస్టేబుల్​ త్రీటౌన్​)ను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందించారు. పని ఒత్తిడి ఎదుర్కొంటూ ఎలాంటి రీ మార్క్​ లేకుండా రిటైర్​ కావడం స్ఫూర్తిదాయకమన్నారు. అదనపు డీసీపీలు బస్వారెడ్డి, రాంచందర్​రావు, సీసీఎస్​ ఇన్​స్పెక్టర్​ శ్రీశైలం తదితరులు ఉన్నారు.