- ఎమ్మెల్సీ దండే విఠల్
- కాంగ్రెస్‌లో చేరిన రెండు గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచ్‌లు
దహెగాం, వెలుగు: రాష్ట్రంలో మరో పదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ ధీమా వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన దహెగాం మడంలంలోని భామానగర్, కొంచెవెల్లి సర్పంచ్‌లతోపాటు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు బుధవారం విఠల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కొంచవెల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కావాలన్నా, గ్రామాభివృద్ధి చెందాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. పార్టీలోని కార్యకర్తలు, నాయకులను కంటికి రెప్పలా పాడుకుంటామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
